ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి విద్యుత్తు లైన్ ఆటంకం
మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే స్పందించి
విద్యుత్ లైన్ తొలగించి ఇంటి నిర్మాణానికి సహకరించాలి
బాధితురాలు శిరీష
తల్లాడ/సత్తుపల్లి,(విజయక్రాంతి): తల్లాడ మండలం, తల్లాడ గ్రామపంచాయతీ పరిధిలోని నారాయణపురం గ్రామంలో సంఘసాని శిరీషకు ఇందిరమ్మ ఇల్లు మంజూర అయింది, గోడలు నిర్మించుకున్నారు. సెంట్రింగ్ పెట్టటానికి, ఇంటి పైన ఉన్న విద్యుత్ లైను ఆటంకంగా మారింది, సెంట్రింగ్ పెట్టడానికి ఎవరు సాహసించడం లేదని, దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయని, సమయానికి ఇల్లు నిర్మించుకోకపోతే, బిల్లు ఆగిపోతుందని, ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితురాలు సంఘసాన్ని శిరీష సంబంధిత అధికారులను, వేడుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్పందించి సహకరించాలని బాధితురాలు వేడుకుంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ లైన్ ను, స్లాబ్ వేయడానికి, అణువుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




