ఆన్‌లైన్ అప్పు.. యువత భవితకు ముప్పు..
- * ఆన్లైన్ అప్పులతో సతమతం
- * మత్తు పదార్ధాలతో దోస్తీ
- * తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం
- * బలవన్మరణాలకు పాల్పడుతున్న యువత
సంస్థాన్ నారాయణపూర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధికి చెందిన యువకుడు ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి తెలిసినవారు, బంధు వుల వద్ద భారీగా అప్పులు చేసి తిరిగి చెల్లించలేక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నారాయణపురం మండలానికి చెందిన యువకుడు స్నేహితులతో కలిసి బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకొని ఇంట్లో వారికి తెలియకుండా మేనేజ్ చేద్దామనుకున్నాడు కానీ పెరిగిన అప్పులతో మానసిక ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు.
చౌటుప్పల్ మండలంలోని గృహిణి ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడి తన భర్తకు కూడా తెలియకుండా 16 లక్షలు అప్పు చేసి ఒత్తిడి తట్టుకోలేక తన పిల్లలను నీటి సంపులో పడేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
ఇలా 20 నుండి 30 సంవత్సరాల వయసుకు చెందిన యువతీ యువకులు అధి కంగా ఆన్లైన్ అప్పులతో సతమతమవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ తల్లిదండ్రులకు కన్నీటి శోకాన్ని మిగులుస్తున్నారు.
నేటి సమాజంలో ఇలా ఆర్థికంగా అప్పుల పాలై తమ జీవితలను గందరగోళంగా మార్చుకుంటున్న యువకులు ఎంద రో ఉన్నారు. చదువుకుంటూనే యువత మ త్తుకు, మద్యానికి అలవాటు పడడం వారికి అడ్డగోలుగా ఆన్లైన్లో అప్పులు దొరకడం తిరి గి చెల్లించలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం సాధారణంగా మారింది.
ఆన్లైన్ అప్పులతో దోస్తీ:
నేటి యువత ఆర్థిక అవసరాలను లక్ష్యం గా చేసుకొని వందలాది ఆన్లైన్ యాప్ లు అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్నాయి.ఆర్థిక అవసరాలకు తక్కువ వడ్డీ అంటూ ఆన్లైన్లో నిరంతరం ప్రకటనల ద్వారా యువతను ఆకర్షిస్తున్నాయి. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు వాటి ఉచ్చులో పడి అప్పులపాలవుతున్నారు. కొంతమంది యువకులు ఒ క్కో యాప్ వాయిదా చెల్లించడానికి మరో యాప్ లో అప్పు చేసిన వారు కూడా వంద ల సంఖ్యలో ఉన్నారు.ఇలా అప్పుల ఊబిలో చిక్కుకొని తీర్చే ఆదాయ వనరు లేక దోపిడీలకు,చైన్ స్నాచింగ్ లకు కూడా పాల్పడుతూ కటకటాల పాలవుతున్నారు.
పల్లెలకు పాకిన గంజాయి మత్తు
పచ్చని పైర్లతో కళకళలాడే పల్లెటూర్లకు సైతం నేడు గంజాయి మహమ్మారి పాకింది. సరదాల కోసం మానసిక ఉల్లాసం కోసం మత్తును అలవాటు చేసుకుంటున్న యువత అదే వ్యసనంగా మారి ఆరోగ్యం క్షీణించి ఆర్థికంగా దిగజారి పోతున్నారు. ప్రస్తుతం గంజా యి మహమ్మారి పల్లెలకు కూడా విస్తరిస్తుంది. మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ఎన్నో దారుణాలకు యువత ఒ డిగడుతున్నారు. మత్తులో తల్లిదండ్రులను కూడా డబ్బుల కోసం చంపిన ఘటన మ నం తరుచుగా చూస్తూనే ఉన్నాం.
స్థాయికి మించి అప్పులు చేస్తూ...
ఫ్యాషన్ అంటూ నేటి యువత తమ స్థాయికి మించి అప్పులు చేసి జల్సాలు చేయ డం అలవాటుగా మార్చుకుంటున్నారు. త మకు అవసరం లేకున్నా సంఘంలో గొప్ప గా బతకాలని లేనివాటికోసం అప్పులు చేసి మరీ సమకూర్చుకుంటున్నారు. అప్పులు చెల్లించే ఆదాయ వనరు లేక కుటుంబం ఆర్థికంగా కుదేలయ్యి సతమతమవుతున్నారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం
తమ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో కొంతమంది తల్లిదండ్రులు ఉంటున్నారు. దీంతో సమాజంలో చెడు స హవాసాలతో యువకులు అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తు న్న నేటి రోజుల్లో స్కూల్ పిల్లలకు వద్ద కూ డా మొబైల్ ఉండడం సర్వసాధారణంగా మారింది. సామాజిక మాధ్యమాలు ఎంటర్టైన్మెంట్ ను దాటి తప్పుదారిలో యువత ప యనించేలా చేస్తున్నాయి.యువకులను ఎన్నో విధాలుగా ఈజీ మనీ అంటూ ఆశ చూ పి ఎరవేస్తున్నారు.
వాటి నుండి బయటపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ మానసిక ఒత్తిడికి లోనై ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గిస్తూ అవసరమైన మేరకు వాడుకునేలా తగు సూచనలు చేయాలి.వారి కెరీర్ కి అవసరమయ్యే సలహాలు సూచనలు చెప్తూ వారు సన్మార్గంలో పయనించేలా చూడాలి.కస్టపడి ఉద్యోగాలు సాధించాలనే కసి పట్టుదల పిల్లలకు కలిగేలా తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవా లంటున్నారు నిపుణులు.
యువత ఆన్లైన్ యాప్ లకు దూరంగా ఉండాలి
‘యువత ఆన్లైన్ యాప్ లకు దూరం గా ఉండాలి. మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ కెరీర్ పై దృష్టిపెట్టి ప్రయోజకులుగా ఎదగడానికి కృషి చేయాలి.ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలి.ఫోన్లలో వచ్చే అనవసర లింకుల ను ఓపెన్ చేసి ఇబ్బందులు పడొద్దు.‘
జె.జగన్, ఎస్ ఐ, సంస్థాన్ నారాయణపురం






