15 April, 2026 | 3:10 AM

మల్లారెడ్డి యూనివర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు

15-04-2026 12:36 AM

అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ రంగంలో కొత్త మైలురాయి

హైదరాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): మల్లారెడ్డి యూనివర్సిటీ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. యూనివర్సిటీ నిర్వహిస్తు న్న బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), న్యూఢిల్లీ నుంచి ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని తొలి ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీగా మల్లారెడ్డి యూనివర్సిటీ నిలిచింది.

దీంతో రాష్ట్రంలో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడింది.అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, పరిశోధన, విస్తరణ రంగాల్లో ఐసీఏఆర్ గుర్తింపు అత్యున్నత ప్రమాణంగా భావించబడుతుంది. ఈ గుర్తింపు యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు, పరిశోధనా సామర్థ్యం, ఆధునిక బోధనా విధానాలు, సదుపాయాలపై ఉన్న నిబద్ధతను ప్రతి బింబిస్తుంది.

ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ డాక్టర్ వీఎస్‌కే రెడ్డి మాట్లాడుతూ ఈ విజయం మా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషికి నిదర్శనం. ఐసీఏఆర్ గుర్తింపు ద్వారా నాణ్యమైన విద్య, సమాజానికి ఉపయోగపడే పరిశోధనల దిశగా మా లక్ష్యాలు మరింత బలపడతాయి అని తెలిపారు.యూనివర్సిటీ స్థాపక చైర్మన్ చి. మల్లారెడ్డి, వైస్ చాన్సలర్ డాక్టర్ వీఎస్‌కే రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కె. శ్రీనివాసరావు, డీన్ డాక్టర్ ఏ. రాజారెడ్డి ల నాయకత్వం, మార్గదర్శకత్వం ఈ విజయానికి కీలకమని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ గుర్తింపుతో యూనివర్సిటీకి మరిన్ని ప్రయోజనాలు లభించనున్నా యి. విద్యార్థులకు దేశీయ, అంతర్జాతీయ స్థాయి లో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడు తూ, ఈ గుర్తింపు మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రతిష్ఠను మరింత పెంచింది.

విద్యార్థులు, తల్లిదం డ్రులు, పరిశ్రమల నమ్మకాన్ని పెంపొందిస్తూ, పరిశోధన, ఆవిష్కరణలకు కొత్త అవకాశాలు తెరుస్తుంది అని తెలిపారు.ఈ సందర్భంగా ఐసీఏఆర్ సంస్థకు, అలాగే యూనివర్సిటీ అధ్యాప కులు, సిబ్బంది, విద్యార్థులు, భాగస్వాములందరికీ యూనివర్సిటీ కృతజ్ఞతలు తెలిపింది.