calender_icon.png 3 November, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి ఆత్మహత్య

23-09-2024 12:00:00 AM

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 22: గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధి ఎన్‌ఎఫ్‌సీ నగర్ సమీపంలో గుర్తు తెలియని యువకుడు శనివారం అర్ధరాత్రి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు నలుపు రంగు జీన్స్ ప్యాంట్, తెల్లగీతల బ్లాక్ షర్ట్ ధరించి ఉన్నాడని, ఎడమ చేతిపై తేలుబొమ్మ పచ్చబొట్టు ఉన్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 58581, 87125 68516 నంబర్లను సంప్రదించాలని చెప్పారు.