calender_icon.png 2 November, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాటరాయుళ్ల అరెస్ట్

23-09-2024 12:00:00 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 22: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో ఉన్న మహిళా మం డలి కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం రాత్రి కొందరు పేకాట ఆడుతున్నారని స్థానికులు పోలీసులకు సమాచా రం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.65 వేల నగదు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.