రైలు కిందపడి యువకుడికి తీవ్ర గాయాలు
08-09-2026 | 09:45am
డోర్నకల్: రైలు కిందపడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం డోర్నకల్ రైల్వే స్టేషన్(Dornakal Railway Station) పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని రాయి గ్రామానికి చెందిన నరేన్ (25) రెండో నంబర్ ప్లాట్‌ఫారం సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కిందపడ్డాడు. ఈ ఘటనలో రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
