13 April, 2026 | 12:55 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

ప్రేమ విఫలం.. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

25-02-2026 11:07 AM

హైదరాబాద్: మణికొండ చిత్రపురి కాలనీలో(Chitrapuri Colony) బుధవారం విషాదం చోటుచేసుకుంది. తన నివాసంలో 21 ఏళ్ల యూట్యూబర్ కోమలి(YouTuber Komali) ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన కోమలి హైదరాబాద్‌లో బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. మణికొండలోని చిత్రపురి కాలనీలో బంధువుల వద్ద ఉంటోంది. విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మరో యూట్యూబర్ అయిన నిఖిల్ రెడ్డితో మూడేళ్లుగా కోమలి ప్రేమలో ఉందని పోలీసులు తెలిపారు.

నిఖిల్ ఆమెను దూరం పెట్టాడు.  బ్రేకప్ బాధతో ఆమె తీవ్ర మనస్థాపం చెందింది.  దాదాపు ఆరు నెలల క్రితమే కోమలి ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఆమె బంధువులు జోక్యం చేసుకుని ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటీవల, ఈ జంటకు వివాహం విషయంలో వివాదం తలెత్తిందని తెలుస్తోంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోమలి చీరతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ కోమలి యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తల్లి మంగళవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.