స్కూల్ వ్యాన్ బోల్తా
25-02-2026 12:24 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో బుధవారం స్కూల్ వ్యాన్ టాటా ఏస్ బోల్తా(School van overturned) పడిన సంఘటన లో పలువురు విద్యార్థులకు గాయాలు అయినట్లు తెలిసింది.మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన వ్యాన్ పలు గ్రామాల నుండి విద్యార్థులను రోజు మాదిరిగానే టాటా ఏస్ లో తీసుకెళ్తుండగా మల్లాపూర్ గ్రామ శివారులో అదుపు తప్పి పంట పొలంలో బోల్తా కొట్టింది.ప్రమాద సమయంలో టాటా ఏస్ లో సుమారు పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు.వారిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




