13 April, 2026 | 12:55 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

25-02-2026 02:24 PM

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

శేరిలింగంపల్లి, పిబ్రవరి 25 (విజయక్రాంతి): రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న ప్రముఖ యూట్యూబర్,విద్యార్థిని కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతూ, చిత్రపురి కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికే చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యూట్యూబర్ అయిన నిఖిల్ రెడ్డిని ఆమె ప్రేమిస్తోంది. గత కొంతకాలంగా నిఖిల్ రెడ్డి ఆమెను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి.ఆరు నెలల క్రితం కూడా కోమలి ఒకసారి ఆత్మహత్యాయత్నం చేయగా, బంధువులు నచ్చజెప్పి కాపాడారు. అయితే, ఇటీవల పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.

మనస్తాపానికి గురైన కోమలి, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. మంగళవారం ఆమె తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిఖిల్ రెడ్డి వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిఖిల్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కోమలి ఆత్మహత్యకు అఖిల్ రెడ్డి వేధింపులు ఏమైనా కారణమా? లేదా కేవలం విరహం వల్లనే ఈ నిర్ణయం తీసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.కోమలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులోని చాటింగ్,కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.