శ్రీ శంభు రామలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీ చోరీ
25-02-2026 02:29 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రంలోని శ్రీ శంభు రామలింగేశ్వర స్వామి ఆలయంలో( Sri Shambhu Ramalingeswara Swamy Temple) హుండీ చోరీకి గురైనట్లు ఆలయ నిర్వహకులు బుధవారం మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నాలుగు రోజుల క్రితం శ్రీ శంభు రామలింగేశ్వర స్వామి జాతర కార్యక్రమం ముగిసింది ఇందులో భాగంగా గర్భగుడి ముందున్న హుండీనీ గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు హుండీ తో సహా మంగళవారం రాత్రి అపహరణకు గురైనట్లు ఆలయ పూజారి ఎల్వి శర్మ మాజీ ఎంపీటీసీ పి విజయ రామారావు మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెరుకు శ్రీరాములు గౌడ్ మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు




