5 March, 2026 | 5:27 PM

Breaking News

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం రేవంత్   •   నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •  

దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి

25-02-2026 01:45 PM

హైదరాబాద్: దేశానికి రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N. Ramachandra Rao) డిమాండ్ చేశారు. దేశ యువతను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఇంకా కొందరు మావోయిస్టులు లొంగిపోతే ఆపరేషన్ కగార్ పూర్తవుతోందని రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎర్రజెండా ఎక్కడా లేదని సూచించారు. అంతమైన కమ్యునిజాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్ బతికించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

విద్యార్థులను అర్బన్ నక్సలైట్ల(Urban Naxalites) పాడుచేయొద్దని కోరారు. అర్బన్ నక్సలైట్లను కూడా అంతం చేస్తామని రామచందర్ రావు హెచ్చరించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు బుధవారం నాడు రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో(Bharatiya Janata Party) చేరారని  రామచందర్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న అపూర్వ ప్రగతికి ఆకర్షితులై, పెద్ద ఎత్తున యువత దేశ సేవలో భాగస్వాములు కావడానికి ముందుకు రావడం అత్యంత హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.