వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా
21-06-2024 07:24 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ పై కోర్టు వాదనలు విన్నది. సీబీఐ అభియోగపత్రంలోనూ దస్తగిరిని సాక్షిగా చూపిచారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువర్గాల వాదనాలు విన్న ధర్మసనం దస్తగిరి పిటిషన్ పై తదుపరి విచారణను జూలై 11కి వాయిదా వేసింది.






