2 September, 2026 | 5:36 PM

జీళ్ళచెరువులో ఘనంగా వైఎస్ఆర్ వర్థంతి వేడుకలు

02-09-2026 | 04:46pm

(కూసుమంచి, విజయక్రాంతి): కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల లింగయ్య ఆధ్వర్యంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పులిహోర పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొక్క ఉపేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ రావు, గ్రామశాఖ అధ్యక్షుడు ఇంటూరి పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ కాసాని వెంకన్న, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బెజవాడ శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు బెల్లం సాయితేజ, కాంగ్రెస్ నాయకులు ఐతగాని నాగేశ్వరరావు, గోపగాని వీరబాబు, ముద్రబోయిన సత్యనారాయణ, అంబాల రామనాధం, కత్తి సత్యం, కత్తి వెంకన్న, కత్తి సత్యం, తమ్మరబోయిన లక్ష్మయ్య, ఐతగాని సత్యనారాయణ, మండవ హుస్సెన్, కొండా శ్రీను, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.