‘వన్ ట్యాగ్’తో టోల్‌ప్లాజాల్లో రయ్ రయ్
- ఫాస్టాగ్ పోర్టబిలిటిని ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
- ముంబై గ్లోబల్ ఫిన్‌టెక్ 2026లో యాప్ ప్రారంభం
- పాతస్టిక్కర్లు తీయకుండానే బ్యాంకును మార్చుకునే సదుపాయం
ముంబై, సెప్టెంబర్ 11: మొబైల్ పోర్టబిలిటీ(Mobile Portability) మాదిరిగానే టోల్‌ట్యాగ్‌లపై(Toll Tag) ప్రయాణిం చే వాహనాలు ఇకపై ‘వన్‌ట్యాగ్’ సౌకర్యాన్ని ఉపయోగించుకొని బ్యాంకు ఖాతా(Bank account)ను మా ర్చుకోవచ్చని, ఇందుకోసం తమ వాహనాలపై ఉన్న పాత స్టిక్కర్ల(Old stickers)ను తీసివేయకుండానే ఈ సదుపాయాన్ని అనుసంధానం చేసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా శాఖ(Union Ministry of Road Transport) మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ప్రకటించారు. శుక్రవారం ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్(Global Fintech) 2026 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి వన్ ట్యాగ్ సేవను ప్రారంభించి ప్రసంగించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(Financial year) చివరి నాటికి టోల్ ప్లాజాల(Toll plazas) వద్ద వాహనాలు వేచి ఉండే సమయాన్ని 10 సెకండ్ల కంటే తక్కువకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇకపై టోల్‌ప్లాజాల వద్ద ఆగకుండా నే వాహనదారులు టోల్ చెల్లించేందుకు వీలు కల్పించే ఈ వ్యవస్థపై జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా కూడా పని చేస్తుందన్నారు.
‘వన్ ట్యాగ్’ యాప్ ద్వారా ఈ సేవలను పొందవచ్చని కేంద్రమంత్రి వివరించారు. దేశంలో ఆరుకోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులున్నారని చెప్పారు. ఈ వ్యవస్థను నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తుందని, బ్యాంకు సమాచారాన్ని వినియోగదారులు కోరుకున్నట్లు స్వయంచాలకంగా అప్‌డేట్ చేస్తుం దని చెప్పారు. ఇకపై టోల్‌ప్లాజా దాటే ప్రక్రియలో వేగం పెరుగుతుందని నితిన్ గడ్కరీ వివరించారు.