బాన్సువాడ మండలంలోని ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదులు
వివరణ ఇవ్వాలని ఎంఈవో నాగేశ్వర్ రావు నోటీసులు
బాన్సువాడ, సెప్టెంబర్ 15(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలపై ప్రజావాణిలో ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.జిల్లా విద్యాశాఖాధికారి ప్రొసీడింగ్స్ Rc.No.1395/B2/2026, తేది 01-09-2026, 24-08-2026న వచ్చిన ప్రజావాణి పిటిషన్ల ఆధారంగా, బాన్సువాడ మండల విద్యాధికారి నాగేశ్వర రావు పలు ప్రైవేట్ స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు.
ఫిర్యాదులపై రెండు రోజుల్లోగా పూర్తి వాస్తవ నివేదిక, వివరణను సంబంధిత రికార్డులు, ఆధారాలతో సహా సమర్పించాలని ఆదేశించారు. సమాచారాన్ని దాచిపెట్టినా, తప్పుడు సమాచారం ఇచ్చినా సీరియస్‌గా పరిగణించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడువులోగా నివేదిక ఇవ్వకపోతే విషయాన్ని జిల్లా విద్యాధికారికి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.నోటీసులు అందుకున్న పాఠశాలలు:1. ది తపోవన్ విద్యాధామ్, బాన్సువాడ,2. ద్రోణ స్కూల్, బాన్సువాడ,3. శ్రీ చైతన్య స్కూల్, బాన్సువాడ,4. సన్‌రైజ్ స్కూల్, హన్మాజీపేట్,5. రిపుల్స్ స్కూల్, బాన్సువాడ,6. నారాయణ స్కూల్, బాన్సువాడ,7. ద్రోణ స్కూల్, బుడ్మి బాన్సువాడ.