హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచాలి

11-09-2026 | 02:49pm

ఖానాపూర్ ( విజయ క్రాంతి): హమాలి యూనియన్ (CITU) ఆధ్వర్యంలో కడెం మండల కేంద్రం  హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమావేశం నిర్వహించారు. అనంతరం CITU జిల్లా కార్యదర్శి బొమ్మెనసురేశ్ మాట్లాడుతూ జిల్లాలోని  పనిచేస్తున్న హమాలి కార్మికులుకు జిల్లా వ్యాప్తంగా ఒకే రేట్లు ఉండాలని డిమాండ్ చేశారు.  కడెం మండల కేంద్రంలో, మందు బస్తాకు  లోడింగ్, అన్ లోడింగ్ చేసే  హమాలీ కార్మికులకు బస్తాకు 15 రూపాయలు ఇవ్వాలి. యాజమాన్యం హమలి కార్మికులను ఆదుకోవాలి కోరారు* హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

 కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు హమాలి కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సం౹౹లుగా హమాలి కార్మికులకు వెల్ఫెర్ బోర్డు ఏర్పాటు చేయాలని, 6వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలు పట్టనట్లు వ్యహరిస్తున్నాయని విమర్శించారు.  తక్షణమే హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు,K.లచ్చన్న, ఉపాధ్యక్షులు,J. మల్లేష్, G. అంజన్న ప్రధాన కార్యదర్శి,J. ,సహాయ కార్యదర్శిలు,కి. రాజన్న, G. రాకేష్,విఠల్,కోశాధికారి M.మహేషతదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు