ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు

26-11-2026 | 05:11pm

నిర్మల్ నవంబర్ 26 ( విజయ క్రాంతి): కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా సోన్ మండలం బొప్పారం గ్రామంలోని(Bopparam Village) శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో(Sri Anjaneya Swamy Temple) రెండు రోజులపాటు  జాతర  హుండీ లెక్కింపును గురువారం చేపట్టారు. అన్ని హుండీలను లెక్కించగా మొత్తం రూ.84,639 నగదుతో పాటు అర గ్రాము బంగారం, 85 గ్రాముల వెండి సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కోశాధికారి లోలం సాగర్, రైటర్ బద్దం నవీన్ రెడ్డి, వీడీసీ సభ్యులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రెడ్డి, లక్ష్మయ్య, గంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు