మధునపోచమ్మను దర్శించుకున్న జైపూర్ ఏసిపి దంపతులు...
26-11-2026 | 05:08pm
కోటపల్లి, (విజయక్రాంతి):మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ మధున పోచమ్మ ను జైపూర్ ఏసిపి దంపతులు(Jaipur ACP couple) దర్శించుకున్నారు.సర్పంచ్ మారీశెట్టి పద్మ ,మాజీ ఎంపిటిసి తిరుపతి వారిని ఆలయంలోకి తోడుకొని వెళ్లారు.
జనగామలో జరుగుతున్న పోచమ్మ జాతరలో మూడవ రోజైన బోనాలు సమర్పణ కార్యక్రమం సందర్భంగా అమ్మవార్లను ఆయన కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. చెన్నూర్ రూరల్ సిఐ క్రిష్ణ, కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్,భీమారం ఎస్ఐ రాజేంధర్,నీల్వాయి ఎస్ఐ నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు