బోట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే పటేల్

16-10-2026 | 05:56pm

కుబీర్ ( విజయక్రాంతి) : బాసర గోదావరి నదిలో(Godavari River at Basara) నిలిచిపోయిన గంగపుత్రుల ఉపాధి బోట్లను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(Pawar Rama Rao Patel) శుక్రవారం ప్రారంభించారు. అనంతరం బోట్లలో గోదావరి నదిలో(Godavari River) షికారు చేశారు. దీంతో బాసరలో బోట్లపై ఆధారపడి జీవిస్తున్న 60 గంగపుత్రుల కుటుంబాలకు తిరిగి ఉపాధి లభించింది. గోదావరి నదిలో బోట్లు నిలిచిపోవడంతో ఉపాధి కోల్పోయిన గంగపుత్రుల కుటుంబాలు గత రెండేళ్లకు పైగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ సమస్యను పరిష్కరించి బోట్ల నిర్వహణకు(Boat maintenance) అనుమతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి బోట్లు తిరిగి ప్రారంభమయ్యేలా కృషి చేశారు. దీంతో 25 నెలల తర్వాత తమ జీవనోపాధి తిరిగి ప్రారంభం కావడంపై గంగపుత్రుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సాయినాథ్ సాయినాథ్ పటేల బాసర మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, బీజేపీ నాయకులు, గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు