‘అభ్యాస దీపిక’ వెబ్‌సైట్ రూపకల్పన

15-10-2026 | 05:16pm

నిర్మల్ ,అక్టోబర్ 15 ( విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘అభ్యాస దీపిక’ వెబ్‌సైట్‌ను(‘Abhyasa Deepika’ website) రూపొందించిన ప్రధానోపాధ్యాయుడు మునిందర్ రాజును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(District Collector Bhavesh Mishra) గురువారం అభినందించారు. గణితం తదితర సబ్జెక్టులను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలు, మెళకువలు, అభ్యాస విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చొరవతో వెబ్‌సైట్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే ఇలాంటి వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత కార్యక్రమాలను మరింత మంది ఉపాధ్యాయులు చేపట్టాలని సూచించారు. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు