పాఠశాల మంజూరు చేయించిన ఖానాపూర్ ఎమ్మెల్యే

14-10-2026 | 02:35pm

ఖానాపూర్( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి లో భాగంగా మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School) నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు మంజూరు చేపించినందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్ చిత్రపటానికి బుధవారం ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కేవలం చదువుతూనే సాధ్యమని ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉండాలన్న ద్రుడ నిష్చయంతో ఎమ్మెల్యే ఖానాపూర్ కు పాఠశాల మంజూరు చేపించారని కార్యకర్తలు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు జంగిలి శంకర్, గొర్రె గంగాధర్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం ,నాయకులు షబ్బీర్ పాష, జన్నారపు శంకర్, కావలి సంతోష్, దేవతి రాజేశ్వర్ ,నేత శ్యామ్, నయీమ్, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు