మున్సిపల్ కార్మికులకు రక్షణ సామాగ్రి పంపిణీ

27-11-2026 | 08:37pm

ఖానాపూర్( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపల్ కార్మికులకు(Khanapur Municipal Workers) మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ రక్షణ సామాగ్రి పంపిణీ చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కార్మికులకు జాకెట్లు, బూట్లు, ఇతర సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షోయబ్ హుస్సేన్ కౌన్సిలర్లు బండి పల్లిసింధుజ ప్రకాష్ గౌడ్, రాజా గంగన్న ,తొడసం ఇందిరా, గుమ్ముల అశోక్ ,కమిషనర్ రవిబాబు, సిబ్బంది మానాల శంకర్ ,పలువురు ఉన్నారు.

మరిన్ని వార్తలు