దుద్దెడలో ఉచిత మెగా వైద్య శిబిరం

27-11-2026 | 08:35pm

మెడిసిటీ ఆసుపత్రి వైద్య బృందంతో వైద్య పరీక్షలు

కొండపాక, నవంబర్ 27 (విజయక్రాంతి): మండలంలోని దుద్దెడ గ్రామ పంచాయతీ(Duddeda Gram Panchayat) కార్యాలయ ఆవరణలో శుక్రవారం మెడిసిటీ ఆసుపత్రి (ఘనాపూర్, మేడ్చల్) వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మిద్దె శివకుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరంలో బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్, చర్మ సమస్యలు, గుండె, ఊపిరితిత్తులు, నరాలు, మూత్రపిండాల సమస్యలు, మోకాళ్లు,

నడుము నొప్పులు తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులకు ఆసుపత్రిలో చికిత్స అందించే సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.

గ్రామానికి వచ్చి ఉచిత వైద్య సేవలు అందించిన మెడిసిటీ వైద్య బృందానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు