ఒంటరి రేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ బీమా కల్పించాలి

27-11-2026 | 08:32pm

బెజ్జంకి,విజయక్రాంతి: రేషన్ కార్డులో ఒక్కరే ఉన్నారనే కారణంతో ఒంటరి మహిళలు, పురుషులను ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి(Indiramma Family Life Insurance Scheme) దూరం చేయడం అన్యాయమని AIYF మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు. అర్హులకు రూ.5 లక్షల బీమా కల్పించే పథకంలో నామినీ సమస్య పేరుతో దరఖాస్తులు తిరస్కరించడం సరికాదన్నారు.

ఒంటరి మహిళలు, వితంతువులు, ఒంటరి పురుషులకు కూడా బీమా అవకాశం కల్పించేలా ప్రభుత్వం నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశారు. ఇతర రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యులను లేదా చట్టబద్ధమైన నామినీలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని, తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలించి అర్హులందరికీ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు