అఖిలపక్ష సమావేశం విజయవంతం చేయండి

21-10-2026 | 04:24pm

ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ పట్టణంలో ఈనెల 24వ తేదీన స్థానిక సీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగే అఖిలపక్ష ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలను(All-party public organizations round table meeting) జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు ఎంసిపిఐ యు జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్(MCPI(U) District Secretary Allepu Peter) పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఖానాపూర్ విశ్రాంతి భవనంలో వామపక్షాల సమావేశం నిర్వహించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ కుల గణన(BC SC ST caste census) డిక్లరేషన్ చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ మోసం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం(Central Government) మెడలు వంచే విధంగా వామపక్షాలు ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాయని, బీసీలకు దేశవ్యాప్తంగా అన్యాయమే జరుగుతుందని బీసీలను అణిచివేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, వైద్యం, రిజర్వేషన్లలో అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు.

ఈ సమావేశంలో ఆ శాఖ సహాయ కార్యదర్శి భూక్య సురేందర్, కే సంజీవ్, నవ తెలంగాణ కే సంజీవ్, బీడీ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవ భోజన్న, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు సూర రాజన్న, నరసయ్య, చుక్కల కళ, బీడి యూనియన్ జిల్లా నాయకురాలు పి స్వరూప ,కార్యదర్శి శిరీష ,మధు, కమల, రాజేందర్ ,కవిత ,తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు