డబుల్ బెడ్ రూమ్ సముదాయం వద్ద బాధితుల ఆందోళన

22-10-2026 | 05:15am

నిర్మల్, అక్టోబర్ 21 (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్దాపూర్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ టోకెన్(Double Bedroom Token) నెంబర్లు కేటాయించిన ఇండ్లు పంపిణీలో జాప్యంపై లబ్ధిదారులు ఆందోళన చేశారు సముదాయంలో అర్హులైన వారికి కేటాయించి న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు.

అర్హులైన వారి జాబితాల పరిశీలన పేరిట పదేపదే సర్వేలు చేస్తున్న సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు అర్హులైన వారి ఎంపికలో ఆలస్యం చేయడం సరికాదన్నారు. తక్షణమే తమకు డబుల్ బెడ్ రూమ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

గత ప్రభుత్వ హాయంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూంలో ఇచ్చేందుకు సిద్దాపూర్ సమీపంలో 600లకు పైగా డబుల్ బెడ్ రూం లతో సముదాయాన్ని నిర్మించి నిర్లక్ష్యంగా వదిలేయడం సరికాదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు గత ప్రభుత్వా హాయంలో పట్టణంలోని మహాలక్ష్మి వాడ ఎల్లాపల్లి ప్రాంతాలలో వందలాదిమంది అర్హులైన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ లో నన్ను పంపిణీ చేసినప్పటికీ తమ ప్రాంతంలో ఇప్పటివరకు పంపిన విషయంలో ప్రభుత్వం పాలకులు,

అధికారాంతంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల కాలం నుంచి ఈ ప్రభుత్వ హాయంలో నాలుగైదు నెలలకు ఓసారి డబుల్ బెడ్ రూమ్లో పంపిణీ పేరిట అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేస్తామంటూ సర్వేలు నిర్వహిస్తున్న ఇండ్లు మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందు మంజూరు చేయని పక్షంలో వాటిని ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు