అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
నిర్మల్ అక్టోబర్ 16 ( విజయక్రాంతి) : నిర్మల్ రూరల్ మండలం(Nirmal Rural Mandal) వెంగ్వాపేట్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం(Primary Health Sub-Centre), సారంగాపూర్ మండలంలోని దని బోరిగం లో 3.60 కోట్లతో నిర్మించే రహదారి అభివృద్ధి పనులను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా నిర్మించిన ఈ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని అన్నారు. ఆలూరు బోరిగం దని గ్రామ ప్రజలకు రహదారి అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాద వనిత, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, బీజేపీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు సత్యం సత్యం చంద్రకాంత్ జమాల్, నరేందర్ సర్పంచులు వనిత విజయ్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.