మేకల కాపరిని చితకబాదిన అటవీ అధికారిని సస్పెండ్ చేయాలి

15-10-2026 | 04:59pm

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ నందిరామయ్య

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం(Khanapur Constituency) పెంబి మండలంలో ఇటీవల అటవీ ప్రాంతంలో(Forest area) మేకలు మేపుకుంటున్న కాపరిని అటవీ అధికారులు అకారణంగా చితకబాది ఆసుపత్రి పాలు చేశారని, వెంటనే అటవీ అధికారి రాథోడ్ ప్రతాప్ నాయక్ ని సస్పెండ్ చేసి, బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంత రాష్ట్ర కార్య వర్గ సభ్యులు నంది రామయ్య డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఆత్రం శేషురావును రామర్శించారు. వెంటనే డిప్యూటీ రేంజర్ రాథోడ్ ప్రతాప్ నాయక్ ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు