రాఘవపేటలో దుర్గాదేవిని దర్శించుకున్న జువ్వాడి
పర్యావరణ పరిరక్షణకు 800 స్టీల్ ప్లేట్ల విరాళం
మల్లాపూర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో దుర్గాదేవి అమ్మవారిని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్(Telangana State Velama Corporation) చైర్మన్ జువ్వాడి నర్సింగరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో దుర్గాదేవి సేవా సమితికి 800 స్టీల్ ప్లేట్లను విరాళంగా అందజేశారు
గ్రామానికి చెందిన విజన్ స్కూల్ కరస్పాండెంట్ నత్తి శేఖర్, 1వ వార్డు సభ్యుడు నత్తి రాము, 8వ వార్డు సభ్యుడు నత్తి లక్ష్మణ్ తమ తండ్రి స్వర్గీయ నత్తి లక్ష్మీరాజాం జ్ఞాపకార్థం ఈ స్టీల్ ప్లేట్లను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జువ్వాడి నర్సింగరావు తన చేతుల మీదుగా దుర్గాదేవి సేవా సమితికి స్టీల్ ప్లేట్లను అందజేశారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవపేట గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.