ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కు ప్రత్యేక చట్టం తేవాలి

16-10-2026 | 05:54pm

ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

చొప్పదండి,  అక్టోబరు 16 (విజయక్రాంతి): ఆర్థికంగా వెనుకబడిన పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో(Education, employment, and employment sectors) రిజర్వేషన్లు కల్పించాలని ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు(Poladi Rama Rao) అన్నారు. శుక్రవారం చొప్పదండి లో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో రథయాత్ర పోస్టర్(Ratha Yatra Poster) ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలనీ, అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలనీ, ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమంపై  సామాజిక ఉద్యమ కారుడు ప్రవీణ్ ఆరోరా చేపట్టిన దేశ వ్యాప్త బస్సు రథ యాత్రకు ఓసీ, రెడ్డి ఐకాసలు, బహుజన సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని, ఈ యాత్ర  24న రాష్ట్రంలో ఆదిలాబాద్ , నిర్మల్, ఆర్మూర్ మీదుగా పరకాలకు చేరుకుంటుందన్నారు. పరకాలలో 50 వేల మందితో బారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్ సంధి తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డి , రెడ్డి సంఘం అధ్యక్షులు కొంరెల్లా రెడ్డి, కొత్త గంగా రెడ్డి, రూప్రెడ్డి స్కైలాబ్ రెడ్డి, కేతిరి మనిశంకరరెడ్డి, గన్ను నర్సింహా రెడ్డి, గుర్రం అంజి రెడ్డి, జంపాల నర్సయ్య, బచ్చు ఆనందం, తాళ్లపల్లి కొంరయ్య,  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు