భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి

12-09-2026 | 04:20am

అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ట్రస్టు ఆధ్వర్యంలో మండపాలకు సహకారం 

ఇందూరు, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): వినాయక మండపాల నిర్వాహకులు, యువ త ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Suryanarayana) తెలిపారు. ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మార్వాడి గల్లిలోని కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చందాలను రాశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు యువత భక్తి మార్గంలో నడవాలని సూచించారు. వినాయక ఉత్సవాలను హిందూ సాంప్రదాయం ప్రకారం ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా శాంతియుతంగా నిర్వహించాలన్నారు. ప్రతి సంవత్సరం తమ ట్రస్టు ద్వారా సహకారం అందిస్తామని గత సంవత్సరం 725 మండపాలకు అందించినట్లు పేర్కొన్నారు. భగవంతుడి ఆశీర్వాదం తో ఈ ఏడాది కూడా వచ్చిన వారందరికీ తన వంతు సహకారం ఉంటుందన్నారు.

వినాయకుడు కేవలం ఒక పండుగకు సంబంధించిన దేవుడు కాదని సంస్కృతి సనాతన ధర్మం ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగి శుభాలు జ రుగుతాయన్నారు. ఇంటింటా గణపతి పూజా చాలాకాలంగా ఉన్నప్పటికీ సామూహిక ఉత్సవాలకు బాలగంగాధర్ తిలక్ ప్రోత్సహించాడన్నారు. దీనిద్వారా ప్రజలు ఒక చోట చేరి సామూహిక ఐక్యతను పెంపొందించుకొనే అవకాశం ఉంటుందన్నారు. శనివారం కూడా ఉదయం 10 నుం చి 12 గంటల వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు