హోసన్నా మినిస్ట్రి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలి

14-10-2026 | 02:23pm

బోధన్, అక్టోబర్ 14 (విజయ క్రాంతి): నిజామాబాద్‌లోని హోసన్నా మందిరం, బోధన్, ఆర్మూర్, నవీపేట్, ధర్మారం, ప్రాంతాల్లో బ్రాంచి సంఘాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు. మినిస్ట్రి ఆధ్వర్యంలో(Under the aegis of the Ministry) నిర్వహిస్తున్న కార్యక్రమాలు.

ఆర్థిక లావాదేవీలు, భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాలు, ఆస్తులు, ఇతర వ్యవహారాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బోధన్ పట్టణంలో ఇతనిపై ఎఫైర్ కూడా నమోదు చేశారు అయినప్పటికీ ఆయన నిజామాబాద్ వదిలి వెళ్ళట్లేదని సంఘం నాయకులు పేర్కొంటున్నారు.

బ్రాంచి సంఘాలకు అందుతున్న సహాయం, ప్రార్థనా మందిరాల నిర్వహణ, భక్తులకు అందించే సేవలు, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత వంటి అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు. అలాగే సంఘాలకు సంబంధించిన భూములు, భవనాలు, ఇతర ఆస్తుల వివరాలను పరిశీలించి, వాటి నిర్వహణలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా బ్రాంచి సంఘాలకు అవసరమైన సహాయం అందించడం, స్థానిక సంఘాల సమస్యలను పరిష్కరించడం, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొంటున్నారు. సంఘాల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు, సంస్థకు సంబంధించిన వ్యవహారాలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.

వ్యక్తిగత విభేదాలు, ఆర్థిక అంశాలు, ఆస్తుల నిర్వహణకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని నిష్పక్షపాతంగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించిన తర్వాతే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు