ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం..

14-10-2026 | 02:28pm

కుటుంబ సభ్యులకు తప్పిన పెను ప్రమాదం

పాపన్నపేట,అక్టోబర్14: ప్రమాదవశాత్తు ఓ ఇల్లు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని మిన్పూర్ గ్రామంలో(Minpur Village) మంగళవారం రాత్రి సమయంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మిన్పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సూఫీ హుస్సేన్ దసరా సెలవులు ఉండడంతో భార్య, ఇద్దరు పిల్లలను తీసుకొని హైదరాబాదులోని బంధువుల ఇంటికి వెళ్లారు.

రోజు మాదిరిగానే తల్లిదండ్రులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. రాత్రి ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగి ఫర్నిచర్, బట్టలు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. తల్లిదండ్రులు తేరుకొని బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనను గమనించిన స్థానికులు బిందెలు, బకెట్లతో నీటిని తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఫర్నిచర్, బట్టలు, వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ సిబ్బంది ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు