బేల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
సీపీఎం ఆధ్వర్యంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ బెల తహసీల్దార్ కు వినతి పత్రం అందజెశారు.
బేల అక్టోబర్ 14(విజయక్రాంతి): బేల మండలాన్ని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకులు(CPM leaders) డిమాండ్ చేశారు. మండలంలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
పంటలు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని, వ్యవసాయానికి అవసరమైన సహాయాన్ని అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరువు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని, తాగునీరు, పశువులకు మేత వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో లంక రఘవులు,సురేందర్, రామన్న,గంగారాం,గోవింద్ తదితరులు పాల్గున్నారు.