వియత్నాం పర్యటనకు ఎంపికైన భారత్‌రెడ్డికి సన్మానం
మంథని, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): వియత్నాం విద్యా పర్యటనకు ఎంపికైన మంథని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల(Manthani Government Boys High School) గణిత ఉపాధ్యాయుడు గీట్ల భారత్‌రెడ్డిని మంథనిలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రెడ్డి సంక్షేమ సంఘం చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత్‌రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. విద్యారంగంలో విశేష సేవలందిస్తూ విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.
మంథని ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు అంతర్జాతీయ విద్యా పర్యటనకు ఎంపిక కావడం గర్వకారణమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలోనూ భారత్‌రెడ్డికి స్థానం లభించిందని గుర్తుచేశారు. వియత్నాం పర్యటన ద్వారా అక్కడి విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన విధానాలను పరిశీలించి, ఆ అనుభవాలను మన విద్యార్థుల బోధనలో ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు. భారత్‌రెడ్డికి మరిన్ని ఉన్నత అవకాశాలు లభించాలని వారు కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఏల్ కొరి సత్యనారాయణ రెడ్డి, గౌరవ అధ్యక్షులు మందల సత్యనారాయణ రెడ్డి, ట్రెసరర్ మూల శేఖర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు మురిళిధర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండ్రు రామదేవి, ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి, లంబు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొని భారత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.