మంథని పుష్కర ఘాట్‌కు స్వర్గీయ శ్రీపాదరావు పేరు పెట్టాలి
- గోదావరి ఒడ్డున భారీ శివుడి విగ్రహం.. బస్ డిపో కూడలిలో నంది విగ్రహం ఏర్పాటు చేయాలి
- మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కోరిన గౌతమేశ్వర ఆలయ చైర్మన్ గుండా రాజు
మంథని, నవంబర్ 27(విజయ క్రాంతి) మంథని పట్టణంలో గోదావరి పుష్కరాల(Godavari Pushkarala) నేపథ్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా పుష్కర ఘాట్‌కు స్వర్గీయ శ్రీపాదరావు పేరు పెట్టాలని గౌతమేశ్వర ఆలయ చైర్మన్ గుండా రాజు కోరారు. శుక్రవారం మంథని మున్సిపాలిటీలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్ల దృష్టికి పలు ప్రతిపాదనలు తీసుకెళ్లారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంథని గౌతమేశ్వర ఆలయం, గోదావరి పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలో పట్టణ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
గోదావరి నది ఒడ్డున భారీ శివుని విగ్రహాన్ని, బస్ డిపో సమీపంలోని కూడలిలో భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పుష్కర ఘాట్‌కు స్వర్గీయ శ్రీపాదరావు పేరు పెట్టడం ద్వారా ఆయన సేవలను స్మరించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి అమలు చేసేలా మున్సిపల్ పాలకవర్గం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామకృష్ణ, తీగల సమ్మయ్య, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.