ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి

27-11-2026 | 08:40pm

జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు(Procurement of Kharif paddy) అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి లతో కలిసి జిల్లా పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, రవాణా, పోలీస్ శాఖల అధికారులు.

ఐ.కె.పి. అధికారులు, రైస్ మిల్లర్లతో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కొరకు అవసరమైన చోట ఐ.కె.పి., ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మద్దతు ధర ఫ్లెక్సీలు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం,

నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, ప్యాడి క్లీనర్లు, డ్రయ్యర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం మిల్లులకు తరలించాలని, రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో జాప్యం చేయకూడదని తెలిపారు.

రైస్ మిల్లర్లు అగ్రిమెంట్లు, బ్యాంకు గ్యారంటీ వివరాలు త్వరగా సమర్పించాలని, గత రబీ సీజన్ సి.ఎం.ఆర్. బియ్యాన్ని త్వరగా అందించాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజిత్ అలీ, జిల్లా మేనేజర్ రజిత, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు