మార్కెట్ యార్డులో పేరుకుపోయిన వడ్ల రాశులు

27-11-2026 | 08:40pm

రైతులకు తప్పని ఇబ్బందులు!

సిద్దిపేట టౌన్: సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో(Siddipet Agricultural Market Yard) వడ్ల కొనుగోళ్లు నెమ్మదించడంతో ధాన్యం రాశులు పెద్దఎత్తున పేరుకుపోయాయి. 15 రోజులుగా కొనుగోళ్ల కోసం రైతులు(Farmers) ఎదురుచూస్తున్నట్లు వాపోతున్నారు. తేమ శాతం 14 ఉంటేనే కొనుగోలు చేస్తున్నారని, మార్కెట్ యార్డులో ప్రైవేట్ వ్యక్తుల కొనుగోళ్ల వ్యవహారం కూడా తమకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. రాత్రి వేళల్లోనూ ధాన్యం రాశుల(Grain heaps) వద్దే ఉండాల్సి వస్తోందని, చలి, కాపలా, ఇతర ఇబ్బందులతో అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి తమకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు