మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు.. మహిళలు ఉపాధి బాట

12-09-2026 | 12:46pm

కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు..

సదానందం, సర్పంచ్ చేతుల మీదుగా సర్టిఫికెట్ల పంపిణీ

ముత్తారం, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అందిస్తున్న ప్రోత్సాహంతో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం అన్నారు. 

శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మైదంబండ గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  సదానందం ముత్తారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు బియ్యని శివకుమార్ తో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. 

ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. శిక్షణతో పొందిన నైపుణ్యాన్ని ఉపాధిగా మార్చుకొని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు మహిళల అభ్యున్నతికి, స్వయం ఉపాధికి అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వం, మంత్రి శ్రీధర్ బాబు అందిస్తున్న ఇటువంటి అవకాశాలను గ్రామీణ ప్రాంతాల మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి రంగంలో ముందుకు సాగాలని సదానందం ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శిక్షణ పొందిన మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





మరిన్ని వార్తలు