డీజే యజమాని అరెస్ట్
12-09-2026 | 12:49pm
కామారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగాయపల్లి(Lingayapalli)లో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా డీజే ఏర్పాటు చేసిన వ్యక్తిని శనివారం దేవుని పల్లి పోలీసులు అరెస్టు చేశారు. డీజే ను సీజ్ చేసినట్లు దేవుని పని ఎస్ఐ రంజిత్ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక చవితి సందర్భంగా డిజేలు ఏర్పాటు చేయవద్దని గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ పని చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు