శేరిలింగంపల్లిలో టౌన్ ప్లానింగ్ కొత్త టీమ్

12-09-2026 | 01:18pm

శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని శేరిలింగంపల్లి జోన్ పట్టణ ప్రణాళికా విభాగంలో విస్తృత స్థాయిలో బదిలీలు జరిగాయి. సీఎంసీ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల మేరకు అనేక సర్కిళ్లలో ఏసీపీలు, టీపీఎస్‌లు, టీపీవోల బాధ్యతలు మారాయి.శేరిలింగంపల్లి సర్కిల్ ఏసీపీగా పనిచేస్తున్న సురేందర్‌రెడ్డిని జీడిమెట్ల సర్కిల్ ఏసీపీగా బదిలీ చేశారు. నార్సింగి ఏసీపీ ప్రసీద్‌కు శేరిలింగంపల్లి ఇంఛార్జి ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగించి, పటాన్‌చెరువు ఇంఛార్జి ఏసీపీ పదవి నుంచి రిలీవ్ చేశారు.

జీడిమెట్ల ఏసీపీ రాణిని పటాన్‌చెరు సర్కిల్ ఏసీపీగా నియమించి, అమీన్ సర్కిల్ ఇంఛార్జి ఏసీపీ బాధ్యతలు కూడా అప్పగించారు. అమీన్‌పూర్ టీపీవో, ఇంఛార్జి ఏసీపీ ప్రసాద్‌ను కొంపల్లి ఇంఛార్జి ఏసీపీగా నియమించారు.జీడిమెట్ల టీపీఎస్ మచ్చేందర్‌ను మాదాపూర్ టీపీఎస్‌గా బదిలీ చేసి, ఆల్విన్ కాలనీ సర్కిల్ టీపీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.చింతల్ టీపీఎస్ మధుకు జీడిమెట్ల సర్కిల్ అదనపు బాధ్యతలు ఇచ్చారు. గాజులరామారం టీపీఎస్ సరిత సేన్‌కు కొంపల్లి సర్కిల్ అదనపు బాధ్యతలు అప్పగించారు.నిజాంపేట్ సర్కిల్ టీపీఎస్ ముఖేష్ సింగ్‌ను మేడ్చల్ సర్కిల్‌కు బదిలీ చేశారు.

నార్సింగి, పటాన్‌చెరు సర్కిళ్ల టీపీఎస్ రమేష్‌కు అమీన్ సర్కిల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. అమీన్‌పూర్ టీపీబీవో రోహన్ ఠాకూర్ మెడికల్ లీవ్‌లో ఉండటంతో, ఆయన విధుల్లో చేరే వరకు రమేష్‌కే అదనపు బాధ్యతలు కొనసాగుతాయి.మేడ్చల్ సర్కిల్ డీఎం గ్రేడ్-3 సాయితేజనును నిజాంపేట్ సర్కిల్‌కు బదిలీ చేసి, దుండిగల్ సర్కిల్‌లోనూ అదనపు బాధ్యతలు అప్పగించారు.ఈ మార్పులు జోన్‌లో పట్టణ ప్రణాళిక పనుల పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు తీసుకున్న పాలనా చర్యగా అధికార వర్గాలు  పేర్కొంటున్నాయి

మరిన్ని వార్తలు