జిల్లాలో ఆయుష్ పోస్టుల ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల

07-11-2026 | 08:58pm

149 దరఖాస్తుల పరిశీలన అనంతరం జాబితాల ప్రకటన

అభ్యంతరాలకు మూడు రోజుల గడువవు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్న ఆయుష్ పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాలను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో ఆయుష్ వైద్యాధికారుల 3 పోస్టులు, ఫార్మసిస్ట్ ఒకటి, సైకో సోషల్ కౌన్సిలర్ ఒకటి, యోగా ప్రొఫెషనల్ ఒకటి కలిపి మొత్తం 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, 149 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు.

వీటిలో ఆయుష్ వైద్యాధికారుల పోస్టులకు 115, ఫార్మసిస్ట్‌కు 18, సైకో సోషల్ కౌన్సిలర్‌కు 6, యోగా ప్రొఫెషనల్ పోస్టుకు 10 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతల ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి పోస్టుల వారీగా మెరిట్ జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు పెద్దపల్లి జిల్లా అధికారిక వెబ్‌సైట్ peddapalli.telangana.gov.in ద్వారా జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు.

మెరిట్ జాబితాలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, ఆధారాలతో నవంబర్ 9, 10, 11 తేదీల్లో మూడు పని దినాల్లోగా సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. మరిన్ని వివరాల కోసం జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జి.ఎన్. అరుణను 9281172473 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

మరిన్ని వార్తలు