సుల్తానాబాద్ లో వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు
వేకువజామున శివలింగానికి అభిషేకాలు
భక్తులతో కిక్కిరిసిపోయిన దేవాలయాలు....
సుల్తానాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్(Sultanabad)లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలునిర్వహించారు. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేకువజామున శివలింగానికిపంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, పుష్పాలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణలు మార్మోగాయి, వేదమంత్రోచ్ఛారణలు, మంగళహారతులు, భక్తి గీతాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభనుసంతరించుకున్నాయి.
కార్తీక మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకొని అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించడం విశేషం. కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలతో సుల్తానాబాద్ లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తితో పూజలు నిర్వహించి స్వామివార్ల ఆశీస్సులు పొందారు. అలాగే ఇళ్లల్లోనూ కార్తీక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.