కొలనూరుకు కొత్త కళ.. పంచాయతీ భవనానికి భూమిపూజ!
కోనరావుపేట, నవంబర్ 5 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలో నిర్మించిన మహిళా సంఘాల నూతన భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జలగం అరవింద్ రావు, మార్కెట్ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ప్యాక్స్ చైర్మన్ బొమ్మేన భాస్కర్ రావు, ఉపసర్పంచ్ బిట్ల బాబు, ప్యాక్స్ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.