ప్రారంభమైన పత్తి పంట కొనుగోళ్ళు. క్వింటాలు 8748

05-11-2026 | 02:45pm

బోథ్. నవంబర్ 5( విజయక్రాంతి)బోథ్. మార్కెట్ పరిధిలోని జిన్నింగులలో గురువారం పత్తి పంట కొనుగోలు(Cotton crop procurement) ప్రారంభమయ్యాయి. మొదటి రోజున క్వింటాలుకు 8748 రూపాయలుగా ధర గా నిర్ణయించారు. స్థానిక స్వప్న, సాయి దత్త జిన్నింగులలో పంట కొనుగోలు ప్రారంభించారు.

దీంతో పత్తి పంట కొనుగోలు ప్రారంభమయ్యాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ వారు క్వింటాలుకు 8667 రూపాయలుగా చెల్లిస్తున్నారు. ప్రైవేట్ ధర ఎక్కువ ఉండడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునేందుకు ఆసక్తి చెబుతున్నారు. కాగా జిల్లాలో వారం రోజుల నుండి ప్రైవేటు మార్కెట్లో పత్తి ధర తగ్గుతూ వస్తున్నది.

మరిన్ని వార్తలు