హామీలు అమలు చేయకుంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం
29-09-2026 | 05:28pm
రాజశేఖర్‌రెడ్డి
తంగళ్ళపల్లి సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూర్మాని రాజశేఖర్‌రెడ్డి. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సిరిసిల్ల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత 9 నెలలుగా గ్రామపంచాయతీలకు నిధులు(Gram Panchayat Funds) విడుదల కాలేదని ఆరోపించారు.
సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ హామీ నిధులు కూడా విడుదల కాలేదన్నారు. పెండింగ్ బిల్లులు నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా సీఎం సిరిసిల్లకు వస్తే సర్పంచులందరం కలిసి పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు గుండు ప్రేమ్‌కుమార్ సాయికృష్ణ బీఆర్‌ఎస్ నాయకుడు సిలివేరి చిరంజీవి పాల్గొన్నారు.