అష్టలక్ష్మి ఆలయంలో రామచందర్ రావు పూజలు
ఎల్బీనగర్, నవంబర్ 21 : భక్తి మార్గంలో నడుస్తూ ప్రజలు సేవా భావంతో ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు(BJP State President Ramachandra Rao) పేర్కొన్నారు. ఆర్కే పురం డివిజన్ వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణని శనివారం సాయంత్రం ఆయన దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వీరన్నగారి రాధా ధీరజ్ రెడ్డి, రంగ నర్సింహ గుప్తా, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వీరన్నగారి ధీరజ్ రెడ్డి, అంజయ్య గుప్తా, పిట్ట ఉపేందర్ రెడ్డి, మంచుకొండ సురేందర్ గుప్తా, చిట్టిమల్ల అశోక్, సుమన్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.