వైభవంగా కార్తీక మాస పవిత్ర ఉత్సవములు
సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న భక్తులు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) వారి ఆలయంలో కార్తీక మాస పవిత్రోత్సవములు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారి ఆలయంలో నిత్య పూజలను పండితులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుని తమ మోక్కులను చెల్లించుకునేందుకు రాష్ట్రం నలమూలం నుండి భారీ సంఖ్యలో భక్తులు(devotees) తరలివచ్చారు.
శనివారం 1470 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రత అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు(devotees) పోటెత్తారు.... యాదగిరిగుట్టలో కార్తీకోత్సవ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్(R P Patnaik) సంగీత విభావరి.... శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న కార్తీకోత్సవ వేడుకల్లో భాగంగా మాడవీధులలో ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు, గాయనీమణులు శ్రీ స్వామివారి భక్తి గీతాలను మధురంగా ఆలపించి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. తమ అద్భుతమైన గాత్రంతో స్వామివారి దివ్య మహిమలను కీర్తిస్తూ భక్తులలో ఆధ్యాత్మిక భావాలను, భక్తి శ్రద్ధలను పెంపొందించారు.
ఈ సంగీత విభావరి కార్యక్రమాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా, ఆనందోత్సాహాలతో తిలకించి సంగీతాన్ని ఆస్వాదించారు. మాడవీధులు భక్తి సంగీతంతో మార్మోగాయి. ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ పీ పట్నాయక్. నిహాల్, శ్రీమతి నిత్య సంతోషిణి, శ్రీమతి గోపికా పూర్ణిమ, శ్రీమతి శ్రీనిధి, మల్లికార్జున్, శ్రీమతి స్వప్న (జర్నలిస్టు) వాద్య బృందం సహకారంతో నిర్వహించిన సంగీత కార్యక్రమం, పరంపర సంస్థ వారి దర్శకత్వంలో ప్రత్యేక నృత్య ప్రదర్శనలతో మరింత భక్తులను అలరించింది.