ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చవద్దు

21-11-2026 | 11:03pm

* బీసీ-ఏ కులాలకు అన్యాయం చేయొద్దు

* బీసీ-ఏ జాబితాలో మార్పులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు

* బీసీ-ఏ కులాల హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

హనుమకొండ, నవంబర్ 21 (విజయక్రాంతి): ముదిరాజ్‌ కులస్తులను(Mudiraj caste people) బీసీ-ఏ గ్రూపులో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని బీసీ-ఏ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నేరెళ్ల విజయ్ కుమార్(Nerella Vijay Kumar) ప్రభుత్వాన్ని కోరారు.శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో(Hanamkonda Press Club) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీ-ఏ గ్రూపులోని వివిధ కులాల ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడుతూ, బీసీ-ఏలో ఉన్న 57 కులాలు యాచక, సేవా వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, జనాభా,రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం కలిగిన ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేరిస్తే ఇప్పటికే వెనుకబడిన చిన్న కులాల పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో అనంతరామన్ కమిషన్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే బీసీ-ఏ గ్రూపును ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఎలాంటి సమగ్ర శాస్త్రీయ అధ్యయనం లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని లేదా వారికి తగిన ప్రత్యామ్నాయ రిజర్వేషన్ కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ-డీ కులాలను బీసీ-ఏలో చేర్చే ప్రతిపాదనలను విరమించుకోవాలని, బీసీ-ఏ వర్గాల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేదర సంఘం అధ్యక్షులు గైనీ రవీందర్,జనరల్ సెక్రటరీ మాకుల గణేష్,రిటైర్డ్ కె యు. ప్రొఫెసర్ డా. గోపు సుధాకర్,గంగపుత్ర సంఘం మహిళా అధ్యక్షురాలు తులసి కళ్యాణి పల్లి, ఉస్మానియా   యూనివర్సిటీ విద్యార్థుల నాయకుడు

 డా. కె. వెంకట్,యువజన అధ్యక్షుడు మారెపల్లి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు