తప్పిపోయిన చిన్నారుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

21-11-2026 | 08:39pm

ఎల్బీనగర్: నాగోల్ డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీలో నివాసముండే రవి, శిరీష దంపతుల కుమారులు వరుణ్ తేజ్(8) మహేశ్ (6) అక్టోబర్ 31వ తేదీ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న  ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శనివారం చిన్నారుల నివాసానికి వెళ్లివారి తల్లిదండ్రులను పరామర్శించి,ధైర్యం చెప్పారు.

అనంతరం నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీతో మాట్లాడారు. తప్పిపోయిన చిన్నారుల ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించి వారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారుల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని, వారికి త్వరగా ఊరట కలిగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీఎంఆర్ రాజు,  సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు